Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన హిందీ బిగ్ బాస్ సీజ‌న్ 11... అతిథులుగా `జుడ్వా2` న‌టీన‌టులు

  • వ్యాఖ్యానంతో అద‌ర‌గొట్టిన స‌ల్లూ భాయ్‌
  • మొత్తం 15 మంది పార్టిసిపెంట్లు
  • సెల‌బ్రిటీలు, సామాన్యుల‌తో నిండిపోయిన బిగ్ బాస్ ఇల్లు
హిందీలో ఎంతో ప్రాచుర్యం పొందిన బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి సంబంధించి సీజ‌న్ 11 ఆదివారం రాత్రి అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఈ సీజన్ కి కూడా వ్యాఖ్యాన బాధ్య‌త‌లు భుజాన వేసుకున్నారు. ఎప్ప‌టిలాగే త‌న‌దైన శైలి మాట‌ల‌తో స‌ల్మాన్ వీక్ష‌కుల‌ను ఆక‌ట్టున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఇటీవ‌ల విడుద‌లైన `జుడ్వా 2` న‌టీన‌టులు వ‌రుణ్ ధావ‌న్‌, జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌, తాప్సీలు అతిథులుగా హాజ‌రయ్యారు.

ఈ సీజ‌న్‌లో సెల‌బ్రిటీలు, సామాన్యులు క‌లిసి మొత్తం 15 మంది పార్టిసిపెంట్లు ఉన్నారు. వీరిలో టీవీ సెల‌బ్రిటీలు శిల్పా షిండే, హితేన్ తేజ్వానీ, హీనా ఖాన్‌, ప్రియాంక శ‌ర్మ‌, బెనాఫ్షా సూన‌వాలా,  శివాని దుర్గా, స‌ప్నా చౌద‌రి, పునీశ్‌ శ‌ర్మ‌, జుబైర్ ఖాన్ ఉన్నారు. వారితో పాటు ఆకాశ్ ద‌డ్లానీ, స‌బ్య‌సాచి స‌త్య‌ప‌తి, ల‌వ్ త్యాగి, మెహ్జాబీ సిద్ధిఖీ, లుసిండా నికోల‌స్, జ్యోతి కుమారి, బంద‌గ‌త క‌ల్రా, అర్షి ఖాన్‌లు సామాన్యులుగా ఎంట్రీ ఇచ్చారు. `ప‌డోసీ (ప‌క్కింటి వాళ్లు)` ఇతివృత్తంతో ఈ సీజ‌న్ కొన‌సాగ‌నుంది.
big boss 11
hindi
colors
salman khan
padosi
judwaa 2
varun dhawan

More Telugu News